14 రగడ: తెలంగాణ, సీమాంధ్ర పోటాపోటీ బంద్‌లు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కూడా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనాలోచితం, తొందరపాటుతో కూడిందని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్‌ను తొలగించడం దురదృష్ణకరమని ఆయన అన్నారు. దానివల్ల సీమాంధ్ర జిల్లాలవారు మాత్రమే కాకుండా తెలంగాణ జిల్లాల విద్యార్థులు కూడా నష్టపోతారని ఆయన అన్నారు.
కాగా, రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతేనే రేపటి (బుధవారంనాటి) బంద్‌ను విరమించుకుంటామని ఒయు జెఎసి నాయకుడు పిడమర్తి రవి చెప్పారు. అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వాన్ని నమ్మడానికి లేదని ఆయన అన్నారు. రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications