చంద్రబాబు అడ్డుపుల్ల: తెలంగాణపై ఫిక్స్‌లో ఎర్రబెల్లి

తెలంగాణ కోసం కాంగ్రెసు కన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కన్నా దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ముందరి కాళ్లకు చంద్రబాబు బంధం వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మళ్లీ రాజీనామాలు చేయడానికి కాంగ్రెసు శాసనసభ్యులను ఒప్పించడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సహచరులతో మంత్రి జానా రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం సాయంత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితర తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశమై అడ్డుపుల్ల వేశారు. జానారెడ్డిని కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కార్యక్రమం ఉంటుందా, ఉండదా అనే సందేహం కూడా తలెత్తుతోంది.












Click it and Unblock the Notifications