చిదంబరంతో చంద్రబాబు రహస్య భేటీ, జగన్‌పైనే?

Chandrababu Naidu-Chidambaram
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని రహస్యంగా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్‌లో ఈ మేరకు బుధవారం ఓ వార్తాకథనం ప్రసారమైంది. బుధవారం రాత్రి 9 గంటలకు సెక్యూరిటీ లేకుండా గంటపాటు చంద్రబాబు అదృశ్యమయ్యారని, ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదని, అయితే ఈ గంట పాటు చంద్రబాబు చిదంబరంతో సమావేశమయ్యారని ఆ టీవీ చానెల్ అనుమానించింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసుపై హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు చిదంబరంతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు ఆ చానెల్ వ్యాఖ్యానించింది. జగన్‌పై కేసు వేసిన మంత్రి శంకరరావు ఇటీవల చిదంబరాన్ని కలిశారు. శంకరరావు భేటీ తర్వాత చంద్రబాబు చిదంబరంతో సమావేశం కావడం వెనక కలిసిపోయి జగన్‌పై కుట్ర చేయడానికేనని ఆ చానెల్ వ్యాఖ్యానించింది. చంద్రబాబు చాటుమాటు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఓ పార్లమెంటు సభ్యుడికి చెందిన కారులో ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు మంగళవారం రాత్రి వెళ్లిపోయారని చానెల్ తెలిపింది.

గంటపాటు అదృశ్యమైన చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారంటూ సాక్షి చానెల్ ప్రశ్నిస్తూనే తాము చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయి చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నామని వ్యాఖ్యానించింది. చంద్రబాబు చిదంబరంతో తెలంగాణ అంశంపై కూడా మాట్లాడి ఉండవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+