ఆస్తుల కేసులో వైయస్ జగన్ అరెస్టు ఖాయమా?

దేశంలో అత్యంత సంపన్నుడైన పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సిబిఐ దర్యాప్తు క్రమంలో అరెస్టు కావచ్చునని ఆ పత్రిక రాసింది. అవినీతి నిరోధక, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద సిబిఐ క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతుంది. సత్యం కేసులో మాదిరిగా వైయస్ జగన్ ఆస్తుల కేసులో కూడా సిబిఐ మల్టీ డిసిప్లనరీ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు సాగించే అవకాశాలున్నట్లు కూడా ఎకనమిక్ టైమ్స్ రాసింది. మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేయడానికి మార్గాలున్న దేశాల నుంచి పెట్టుబడుల స్వీకరణ వంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు బృందంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను, ఇతర సంస్థల అధికారులు ఉండే అవకాశాలున్నట్లు ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications