వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే జగన్‌ను వైయస్ బెంగళూర్ పంపారు: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తన అధికారాన్ని ఉపయోగించుకుని సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకుంటున్నారనే విమర్శలు రాకూడదనే వైయస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్‌ను బెంగుళూర్ పంపించారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం వెనక కాంగ్రెసు కుట్ర ఉందని జగన్ ఆరోపించడంపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. బెంగుళూర్ పంపించినప్పటికీ జగన్ తన సంస్థల్లో పెట్టుబడులు ఎలా పెట్టించుకున్నారో తెలియదని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తుల నుంచి జగన్ పెట్టుబడులు పెట్టించుకోవాల్సిందని, ఆ నైతికతను కూడా జగన్ పాటించలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ఉగ్గుపాలతో పెరిగి లాభం పొందిన జగన్ ఇప్పుడు కాంగ్రెసు విమర్శించడం బాధాకరమని ఆయన అన్నారు.

ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పి జగన్ ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిందని, ఇందులో కాంగ్రెసు పాత్ర ఏమీ లేదని, కోర్టు చాలా మంది మీద సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిందని ఆయన అన్నారు. హైకోర్టును శంకించే విధంగా వైయస్ జగన్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా కుట్రగా మాట్లాడడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని ఆయన అన్నారు. బిజెపికి వైయస్ జగన్ ముసుగు అని, జగన్ బిజెపి ఏజెంటుగా పనిచేస్తున్నారని, జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా బిజెపి నాయకులు పార్లమెంటులో బల్లలు చరచడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి జీవించినప్పుడే జగన్‌పై చాలా అభియోగాలు వచ్చాయని, గత ఐదేళ్లలో జగన్ ఆస్తులు పెరిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెసును విమర్సిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు చెట్టుకు చెందిన విషపు కొమ్మ జగన్ అని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు విషపు పురుగా, కాంగ్రెసు విషపు వృక్షమో చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెసు నీడలోనే చంద్రబాబు పెరిగారని ఆయన అన్నారు. అనుభవం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తానని సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి చెప్పినట్లు జగన్‌కు చెప్పారని ఆయన అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులతో, జగన్‌తో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని ఆయన అన్నారు.

English summary
Congress MP Lagadapati Rajagopal lashed out at YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X