హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణాలోనూ భాను భూదందా: పక్కా ప్లానింగ్‌తోనే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో భూదందా చేసినట్లుగా తెలుస్తోంది. అది కూడా పక్కా ప్లానింగుతో చేసే వాడని సమాచారం. రాజధాని హైదరాబాదులో భూమికి గిరాకీ ఉండటంతో భూదందాలకు పాల్పడిన విషయం తెలిసిందే. రాజధానితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సైతం భవిష్యత్తు కాలంలో భూములకు ఎక్కడ విలువ పెరుగుతుందనుకుంటే అక్కడ భూములు కొని పెట్టేవాడని సమాచారం. అందులో భాగంగా కృష్ణా జిల్లాలోనూ భాను భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల రెవెన్యూ అధికారుల రికార్డు తనిఖీల్లో తన పేరుతో పాటు బినామీ పేర్లతో సైతం భాను భూములు కొనుగోలు చేసినట్లుగా బయటపడినట్లు సమాచారం.

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి నాటి వైయస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భవిష్యత్తులో అక్కడ భూములు ధరలు పెరుగుతాయని భావించిన భాను తన పేరుతో 9.27 ఎకరాలు, కృష్ణ అనే వ్యక్తి పేరిట 10.24 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా బయటపడినట్లు సమాచారం. సముద్ర తీర ప్రాంతం కావడంతో పోర్టు వస్తే భూములు ధరలు భారీగా పెరుగుతాయని భాను భావించినట్లుగా తెలుస్తోంది. నిడమర్రు పరిధిలో పొలం కొన్నట్లుగా తెలుస్తోంది. గోబిలేరు ప్రాంతంలోనూ కొంత భూమి కొన్నట్లు తెలుస్తోంది. ధరలు పెరుగుతాయనుకునే పరిసర భూములను కేవలం తానొక్కడే కొనకుండా సినిమా ఇండస్ట్రీతో తనకు ఉన్న పరిచయం నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురిచే భూములు కొనిపించినట్లుగా తెలుస్తోంది.

English summary
Bhanu Kiran, who is main accused in Maddelacheruvu Suri murder case was sale lands in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X