AP Weather: రేపు, ఎల్లుండి వీళ్లకు ఎండలు-వాళ్లకు వర్షాలు..!

ఏపీలో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ప్రవేశం వేళ మిశ్రమ వాతావరణ పరిస్ధితులు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఎండలు మండిపోతుంటే, మరికొన్ని చోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వర్షాలు పడుతున్న చోట ప్రజలు కాస్త ఊరట పొందుతున్నారు. ఇదే క్రమంలో రాబోయే 48 గంటల్లో అంటే వచ్చే రెండు రోజుల్లో ఇలాగే మిశ్రమ వాతావరణ పరిస్ధితులు (AP Weather) ఉంటాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజుల పాటు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. రేపు 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపుతాయన్నారు. పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

AP Weather Forecast IMD Predicts Heatwave and Rain in Different Districts for 48 Hours

విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అటు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 40-42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

AP Weather Forecast IMD Predicts Heatwave and Rain in Different Districts for 48 Hours

మరోవైపు నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందన్నారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+