రామోజీ, చంద్రబాబులపైకి నెట్టిన జగన్ సాక్షి డైలీ

సాక్షి డైలీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను ఉటంకిస్తూ కోనేరు ప్రసాద్ అనే వ్యక్తికి ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో సంబంధాలు ఉన్నాయని సాక్షి రాసింది. కోనేరు ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడని వ్యాఖ్యానించింది. ప్రసాద్‌కు ఎమ్మార్‌తో ఉన్న లింకు తెలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాసింది. చంద్రబాబు అస్తుల వ్యవహారాల పర్యవేక్షుకుడు కోనేరు ప్రసాదేనని వ్యాఖ్యానించిది. కోనేరు చారిటబుల్ ట్రస్టుకు చైర్మన్ ఈనాడు ఎఁడి రమేష్‌బాబు అని అంటూ ఆ రకంగా వ్యవహారాన్ని ఈనాడు అధినేత రామోజీరావుకు అంటగట్టే ప్రయత్నం చేసింది. కోనేరు - బాబు - ఈనాడు లింకులున్నాయని ఆరోపించింది.












Click it and Unblock the Notifications