విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా లక్ష్మణ్ బాపూజీతో లగడపాటి భేటీ మతలబు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: తాజాగా ఏర్పడి రాష్ట్ర సాధన తెలంగాణ సమన్వయ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం సాయంత్రం కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీని సమైక్యాంధ్రను కోరుకుంటున్న లగడపాటి రాజగోపాల్ కలవడంలోని ఆంతర్యమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. కొండా లక్ష్మణ్ బాపూజీకి లగడపాటి రాజగోపాల్ పాదాభివందనం చేశారు.

తాము కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఇచ్చిన సమైక్యాంధ్ర రాష్ట్ర నివేదికను తాను కొండా లక్ష్మణ్ బాపూజీకి అందించినట్లు లగడపాటి రాజగోపాల్ సమావేశానంతరం చెప్పారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని తాము ఇద్దరం నమ్మినట్లు ఆయన తెలిపారు. తాను కొండా లక్ష్మణ్ బాపూజీని విజయవాడుకు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. తాను తెలంగాణలో పర్యటించడానికి తగిన వాతావరణం లేదని ఆయన చెప్పారు. తాను తెలంగాణ ప్రజల మనోభావాలను ఎప్పూడూ అగౌరవపరచలేదని, అభిప్రాయాలతో విభేదించి ఉండవచ్చునని ఆయన అన్నారు.

ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యవూర్వక వాతావరణం ఏర్పడాల్సి ఉందని, ఇందుకు గాను ఇరు ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించాలని అనుకున్నామని కొండా లక్ష్మణ్ బాపూజీ చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను తాము తొలగిస్తామని ఆయన అన్నారు.

English summary
Congress MP Lagadapati Rajagopal, who is opposing state division, met Konda Laxman Bapuji, who is demanding seperate Telangana movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X