‘పెద్ది’ ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ కేక.. సెకండాఫ్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పెద్ది' చిత్రం మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. బుధవారం నాడే యుఎస్ఏతో పాటు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడనుండటంతో, మెగా అభిమానుల్లో ఉత్కంఠ ఆకాశాన్ని తాకుతోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు పెంచేసిన 'పెద్ది'.. ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రేక్షకులను సరికొత్త స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా లోకంలోకి తీసుకెళ్లనుంది. దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్, ఎమోషనల్ రోల్‌లో ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది.
ఎక్కడా బోర్ కొట్టదు
సినిమా మొదటి భాగం ప్రథమార్ధం అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా, అత్యంత వేగంగా సాగిపోతుందని సమాచారం. కథలో వచ్చే ఫన్ ఎలిమెంట్స్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ మరియు క్రికెట్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సులు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదనపు ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే రేంజ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్‌ను డిజైన్ చేశారని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

కథ ఢిల్లీకి మారిన తర్వాత
కథా నేపథ్యం ఆంధ్ర నుండి ఢిల్లీకి మారినప్పుడు, సెకండాఫ్ కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడే కథనం కొంత నెమ్మదించినట్లు అనిపించినప్పటికీ, కథ డిమాండ్ మేరకు వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కనెక్ట్ చేస్తాయి. అయితే, సినిమా చివరి 30 నిమిషాల్లో వచ్చే రేస్ ఎపిసోడ్స్ మాత్రం ఆడియన్స్‌ను ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తాయి. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో అందరినీ కంటతడి పెట్టిస్తారని, ఈ చిత్రానికి ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డులు రావడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. బుచ్చిబాబు టేకింగ్, విజువల్స్ గ్రాండియర్ టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. 'పెద్ది' చిత్రం మైండ్ బ్లోయింగ్ ఫస్టాఫ్, కాస్త ఎమోషనల్ గా సాగే సెకండాఫ్‌తో అలరించబోతోంది. ఏదేమైనా, రామ్ చరణ్ వన్ మ్యాన్ షో, ఆయన పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ థియేటర్లలో చప్పట్లు కొట్టించడం ఖాయం.












Click it and Unblock the Notifications