సీమాంధ్ర విద్యార్థుల నిరసనలపై పురంధేశ్వరి అసంతృప్తి

14ఎఫ్ రద్దు చేసిన తర్వాత సీమాంధ్రలో విద్యార్థులు నిరసనలు చేపట్టడం సమంజసం కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రద్దుపై రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, అందరూ దీన్ని అంగీకరించారని తెలిపారు. శాసనసభ తీర్మానం చేసిన నేపథ్యంలోనే కేంద్రం దీన్ని రద్దు చేసిందని విశాఖపట్నం వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా 14ఎఫ్ రద్దును అందరూ స్వాగతించాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2001 నుంచి 2008 వరకు 14ఎఫ్ రద్దయినట్లుగానే భావించి పోలీసు శాఖలో హైదరాబాద్‌లో నియామకాలు జరిగాయని గుర్తుచేశారు. 2008 తర్వాత రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నుంచీ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. కొంత మంది అభ్యర్థులు దీన్ని రద్దు చేయాలని, కోర్టును ఆశ్రయించడంతో సమస్య వచ్చిందని, ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదని స్పష్టం చేశారు.
14ఎఫ్ నిబంధన తొలగింపునకు నిరసనగా సమైక్యవాదులు విశాఖపట్నంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఆరుబయట స్నానాలు చేసి నిరసన తెలిపారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి నిరసన దీక్షలు ప్రారంభించిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ప్రతినిధులు శనివారం ఉదయం అక్కడే స్నానాలు చేశారు. పోలీస్ శాఖలో సీమాంధ్ర ప్రాంత నిరుద్యోగులకు అవకాశం లేకుండా చేసిన 14ఎఫ్ నిబంధన తొలగింపునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications