వైయస్ జగన్ తప్పించుకోవాలనుకుంటున్నారు: విహెచ్

ప్రజాధనం దుర్వినియోగంలో జగన్ ఎంత బాధ్యుడో కెవిపి అంతే బాధ్యుడన్నారు. జగన్ నల్లమచ్చ లేని నాయకుడని గతంలో పలికిన వైస్సార్సీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం ఏమిటన్నారు. మచ్చలేని నాయకుడు అయితే నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. హైకోర్టుకు జగన్ పైన కక్ష ఎందుకు ఉంటుందన్నారు. త్వరలో అంబటి రాంబాబు వ్యవహారాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. 14ఎఫ్ రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకు వెళతానని హెచ్చరించారు. తెలంగాణ వారిది ప్రజల ఉద్యమం అయితే సీమాంధ్రులది స్పాన్సర్ల ఉద్యమం అన్నారు.












Click it and Unblock the Notifications