ఢిల్లీ వేదికగా క్రాప్ హాలిడేపై దీక్షకు బాబు యోచన

అయితే గతంలో హైదరాబాదులో దీక్ష చేసిన చంద్రబాబు ఈసారి ఢిల్లీ వేదికగా దీక్ష చేయాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. జాతీయ స్థాయిలో రాష్ట్ర రైతాంగ సమస్యలను తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర రైతాంగానికి జాతీయస్థాయి నేతల మద్దతును కూడగట్టి తద్వారా పార్లమెంటులో రాష్ట్ర రైతాంగ సమస్యలపై వారంతా స్పందించేందుకు వీలుగా ఢిల్లీ వేదికనే సరియైనదిగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీక్ష చేసేది లేనిది సాయంత్రం టిడిపి పోలీట్ బ్యూరోలో మాట్లాడిన అనంతరం నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నిరాహార దీక్షకు సిద్ధపడిన పక్షంలో ఈ నెలాఖరులోగా కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ దీక్ష ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ నెల 26, 27 తేదీల్లో జాతీయస్థాయి నేతలతో కలిసి కోనసీమలో రైతులను పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications