26 మంది వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామా

అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నేను ఎందుకు రాజీనామా చేస్తున్నానను అంటూ ఓ కరపత్రాన్ని పంపిణీ చేశారు. రాజీనామాల అనంతరం మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు కరపత్రంలోని అంశాలను చదివి వినిపించారు. పార్టీ నిర్జీవంగా ఉన్న సమయంలో పాదయాత్ర చేసి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చారని అందులో పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వం వైయస్ ఆశయాలను తుడిచి వేస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రజల గుండెల్లో నుండి వైయస్‌ను తుడిచి వేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. వైయస్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్‌కు ఎవరూ సాటి రారని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాలు సమర్పించామని అన్నారు. వైయస్సాఆర్, జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెసులో కొనసాగలేమని అన్నారు. పార్టీకి కూడా రాజీనామాలు చేస్తున్నామని అన్నారు. స్పీకరు రాజీనామాలను ఆమోదించాలని లేదంటే కాంగ్రెసుకు అంతకంటే దౌర్భాగ్యం లేదన్నారు. కాంగ్రెసు నేతల కంటే ముందుగానే అసెంబ్లీ చేరుకున్న టిడిపి రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించారు. కాగా కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు గాంధీ భవన్‌కు ఫ్యాక్స్ పంపారు.












Click it and Unblock the Notifications