వైయస్సార్ అవినీతిపరుడే, ఆనాడే చెప్పాం: చంద్రబాబు

కాంగ్రెసు అవినీతిని ప్రోత్సహించడం వల్లనే వైయస్ జగన్ ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో సంపదనంతా వైయస్సార్ ప్రభుత్వంలో దోచుకుని తాము ప్రవేశపెట్టిన పథకాలను వారి పథకాలుగా ప్రచారం చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రాజెక్టులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని, అయితే వాటిని దోచుకోవడానికి అనువుగా మర్చుకున్నారని, తప్పుదారి పట్టించి రామలింగరాజును కూడా జైలుకు పంపించారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో తమ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి లాభం చేకూరే విధంగా ఉందని, ఆ తర్వాతనే మార్పులు చేశారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ ఒప్పందంపై, దాని వల్ల తాము ఆశించిన ఫలితంపై ఆయన వివరించారు. తననే తప్పు పట్టే స్థాయికి వారు చేరుకున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు వాళ్లు అవినీతిని ప్రోత్సహించి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని ఆయన దుయ్యబట్టారు. కోర్టులను కూడా ఎదిరించే స్థితికి వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు చేరుకున్నారని హైకోర్టును సవాల్ చేస్తున్నారని, రాజా, కనిమొళి అరెస్టయినా డిఎంకె నాయకులు ఆందోళనలు చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications