స్వార్థపూరిత శక్తి: వైయస్ జగన్‌పై చిరంజీవి నిప్పులు

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొందరు బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారని విమర్శించారు. అప్పుడు ప్రభుత్వాన్ని పడగొడతామంటూ హెచ్చరికలు చేశారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఆదుకుంటామని తాను అప్పుడే చెప్పానని అన్నారు. నాడు రోశయ్య ప్రభుత్వం సక్రమంగా కొనసాగకుండా చాలా ప్రయత్నాలు చేశారని అన్నారు. అధఇకారం వంశపారంపర్యంగా వచ్చేది కాదన్నారు. కొందరి తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని విమర్శించారు. కాంగ్రెసు, పిఆర్పీకి భావసారూప్యత ఉందన్నారు.
ఈ పుట్టిన రోజు తనకు చాలా ప్రత్యేకమైనదన్నారు. భవిష్యత్తులో అద్భుత ఫలితాల సాధనకే విలీనం అన్నారు. ఈ రోజుతో పిఆర్పీ పూర్తిగా విలీనం అయిందన్నారు. భవిష్యత్తులో విజయం సాధించేందుకు ఈ విలీనం నాంది అన్నారు. సోనియా విధానాలు నచ్చి కాంగ్రెసులో చేరినట్లు చెప్పారు. పార్టీ పెట్టినప్పుడు విలీనం ఆలోచన లేదని గ్రేటర్ ఎన్నికల సమయంలో నాటి పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ విలీనం ప్రతిపాదన తీసుకు వచ్చారని అన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని చెప్పారు. జీవితాంతం కాంగ్రెసులోనే ఉంటానని అన్నారు. సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెసులో చేరటం సంతోషంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications