వైయస్ జగన్ వర్గం రాజీనామాలపై కాంగ్రెసు డోంట్ కేర్

lagadapati rajagopal
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుల రాజీనామాలను అంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెసు నేతల మాటలను బట్టి వారు ఎప్పుడెప్పుడు రాజీనామాలు చేస్తారా అని చూస్తోన్నట్టు కనిపిస్తోంది. జగన్ వర్గం నేతల రాజీనామాల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం అన్నారు. తన సోదరుడు లగడపాటి శ్రీధర్‌ ల్యాంకో గ్రూపు నుండి ఎప్పుడో తప్పుకున్నారని, శ్రీధర్ జగతిలో పెట్టుబడులు పెట్టిన విషయంపై సిబిఐ అధికారుల ముందు హాజరయ్యాడని జగన్ సైతం తన సోదరుడిలాగే సిబిఐ ముందు హాజరు కావాలని జగన్ వర్గం నేతల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జగన్ తనను తాను గొప్ప మేధావిగా, పారిశ్రామిక వేత్తగా అభివర్ణించుకుంటున్నారని, తనకు ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు ఇవ్వాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. మరో అయిదేళ్లు సమయం తీసుకొని ఇప్పుడు తనకున్న కంపెనీల్లో పదోవంతు కొత్తగా ప్రారంభించాలని జగన్‌కు సవాల్ విసిరారు.

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామాలను ఓ డ్రామాగా అన్నారు. దేశమంతా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే జగన్ వర్గం మాత్రం అవినీతికి మద్దతుగా ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. జగన్ కాంగ్రెసు ద్వారా ఎదిగి ఆ కాంగ్రెసునే దెబ్బ తీయాలని చూస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. రాజీనామాలపై మాజీ ముఖ్యమంత్రి రోశయ్య స్పందిస్తూ రాజీనామాలతో ప్రభుత్వం పడిపోతుందో లేదో ఆలోచించే శక్తి తనకు లేదని చెప్పారు. జగన్ వర్గం నేతలు ఆలస్యంగా రాజీనామాలు చేశారని ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండెనని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సైతం జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయవద్దని కోరినప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామాలపై పునరాలోచించుకోవాలని చెప్పారు. అయితే వారిని బతిమాలే విధమైన విధంగా మాట్లాడేది లేదన్నారు. తదుపరి నిర్ణయం వారిదే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+