తన భర్త నిర్దోషి అని విజయమ్మ చెప్పలేదు: విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి నిర్దోషి అని పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఎక్కడా చెప్పలేదని, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో కూడా అలా చెప్పలేదని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఎప్పుడూ విమర్శించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులే వైయస్సార్ తప్పు పట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గం రాజీనామాల వల్ల తమ ప్రభుత్వానికి నష్టం లేదని, నష్టపోయేది వారేనని ఆయన అన్నారు.

జగన్ అవినీతి జగమెరిగిన సత్యమని రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ వర్గం శాసనసభ్యులు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతుంటే కొంత మంది జగన్ అవినీతిని సమర్థిస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌పై కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని ఆయన అన్నారు.

జగన్ ఆస్తులపై సిబిఐ దాడుల విషయంలో తమ పార్టీ ప్రమేయం ఏ మాత్రం లేదని, హైకోర్టు ఆదేశం మేరకే సిబిఐ దర్యాప్తు జరుగుతోందని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. న్యాయ ప్రక్రియను జగన్ వర్గం శాసనసభ్యులు అంగీకరించాలని ఆయన అన్నారు. జగన్ వర్గం శాసనసభ్యుల వాదన కోర్టు ధిక్కారమే అవుతుందని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తమ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన నష్టం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+