జగన్ వర్గ ఎమ్మెల్యే రాజీనామాలు ఆమోదిస్తారా?

తెలంగాణ కోసం నాగం జనార్దన్ రెడ్డి బృందం చేసిన రాజీనామాలు ఇంకా స్పీకర్ వద్ద పెండింగులో ఉన్నాయి. గతంలో అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ తిరస్కరించి, విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. భావోద్వేగాలతో రాజీనామాలు చేసినందున తిరస్కరించినట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో తెరాస శాసనసభ్యులు, నాగం బృందం మళ్లీ రాజీనామాలు చేశారు. అవి పెండింగులోనే ఉన్నాయి. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనశభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా అనేది సంశయంగానే ఉంది. వైయస్సార్ అనే భావోద్వేగంతో వారు రాజీనామా చేశారని తిరస్కరిస్తారా అనేది కూడా చెప్పలేం. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాజీనామా చేసిన ఇద్దరు తమ పార్టీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగి రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. అలాగే, శోభానాగిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని ప్రజారాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది. కొద్ది మంది తమ పార్టీ శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు చేసింది. వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. రాజీనామాలు చేసిన తమ పార్టీకి చెందిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై కాంగ్రెసు స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, అనర్హత వేటు పడేలా చూస్తుందా అనేది కూడా ఆసక్తికరమైన అంశమే.












Click it and Unblock the Notifications