వైయస్ జగన్ వెంట మరో 13 మంది ఎమ్మెల్యేలు?

YS Jaganmohan Reddy
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట మరింత మంది శాసనసభ్యులు నడుస్తారని, మరో 13 మంది శాసనసభ్యులు జగన్‌కు మద్దతుగా రావడానికి సిద్ధంగా ఉన్నారని వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎవరెవరు వస్తారు వంటి వివరాలు అందించడం ప్రస్తుతం సరి కాదని ఆయన అన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య 20 నిమిషాల పాటు చర్చలు జరిగాయి.

శాసనసభ్యుల రాజీనామాల గురించి, తాజా పరిణామాల గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ప్రస్తుతం జగన్‌కు మద్దతుగా 29 మంది శాసనసభ్యులు ముందుకు వచ్చారని, మరింత మంది వస్తారని జగన్‌తో భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, అధైర్యపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగుదామని వైయస్ జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు.

తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని, తమ రాజీనామాలు డ్రామా కాదని వైయస్ జగన్ వర్గానికి చెందిన శోభా నాగిరెడ్డి అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత పులివెందుల వెళ్లిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు మంగళవారం హైదరాబాదు తిరిగి వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుంటే తమ రాజీనామాలను ఆమోదించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+