వైయస్ జగన్ కేసులో దస్తావేజులను పరిశీలిస్తున్న సిబిఐ

32 కంపెనీలు, వ్యక్తులకు చెందిన రికార్డులను పరిశీలిస్తున్నారు. కేసులలో సాక్ష్యాలకు పనికొచ్చే దస్త్రాలను వేరు చేస్తున్నారు. సోదాల్లో సేకరించిన పత్రాలను స్కాన్ చేసి సిడిల్లో భద్రపరుస్తున్నారు. కేసులో తదుపరి దర్యాఫ్తు కోసం ఇప్పటికే 8 బృందాలను సిబిఐ ఏర్పాటు చేసింది. నిందితులను విచారించేందుకు ప్రశ్నావళిని తయారు చేస్తోంది. కాగా తన నివేదికను నాంపల్లి కోర్టుకు బుధవారం మధ్యాహ్నం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications