జగతి రిటర్న్స్ కారణం: జగన్‌పై వట్టి ఎదురు దాడి

Vatti Vasanth Kumar
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగతి పబ్లికేషన్స్ సమర్పించిన ఐటి రిటర్న్స్ చూసి వైయస్సే జగన్ కంపెనీలపై సిబిఐ విచారణకు ఆదేశించి ఉండే వారని మంత్రి వట్టి వసంత్ కుమర్ మంగళవారం మీడియా సమావేశంలో జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. జగతి పబ్లికేషన్స్ సమర్పించిన ఐటి రిటర్న్స్ వల్లనే పలువురిలో అవినీతి అనుమానాలు తలెత్తాయన్నారు. వైయస్ ఉన్న సమయంలో అంత మొత్తంలో ఐటి పన్ను కట్టని జగన్ ఆ తర్వాత అంత పెద్ద మొత్తంలో పన్ను కట్టడంతో 2004 - 2009 వరకు వైయస్ హయాంలో అవినీతి జరిగిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైయస్ సచ్ఛీలుడైనప్పటికీ జగన్ వల్లే ఆయనపై మచ్చ పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
దానిని జగన్ తుడిపేసే ప్రయత్నం చేయాలన్నారు.


వైయస్ అంటే మంత్రివర్గంలో అందరికీ అభిమానమే అన్నారు. దానిని కొద్దిమందికే పరిమితం చేసి మాట్లాడటం సరికాదన్నారు. వైయస్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరిపించినట్లు చెప్పారు. తన తండ్రి మరణంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్న జగన్ పార్లమెంటులో ఒక్కసారైనా ఈ విషయాన్ని ప్రస్తావించారా అని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ కేవలం రాజకీయ స్వార్థం కోసం మాత్రమే ఆయన తండ్రి మృతిని అడ్డు పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీ నేతలు ఆయన ఓదార్పు యాత్రకు మద్దతు పలికారన్నారు. కానీ ఆయనే పార్టీ నేతలపై విమర్శలు చేశారని అన్నారు. నాటి ముఖ్యమంత్రి రోశయ్య సైతం జగన్ ఓదార్పుకు సహకరించాలని మంత్రులను, నేతలను కోరినట్లు చెప్పారు. జగన్ కాంగ్రెసు నుండి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఓదార్పు ప్రారంభమైన రెండో రోజు చేసిన వ్యాఖ్యల ద్వారానే అర్థమవుతోందన్నారు.

బాధితులకు మద్దతుగా చేస్తున్న ఓదార్పు యాత్రలో రాజకీయాలు వద్దని చెప్పిన జగన్ ఆ తర్వాత అన్నీ రాజకీయాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. వైయస్ పథకాలు అమలు కావడం లేదని జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన తన ఓదార్పులో నిత్యం కాంగ్రెసును లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వైయస్ సైతం సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించిన సందర్భాలు ఉన్నాయన్నారు. రింగ్ రోడ్డు, వ్యోక్స్ వ్యాగన్‌లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వైయస్ సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించారని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ హస్తం ఉందని చెప్పినప్పుడు తన తనయుడి పైనే వైయస్ సిబిఐ దర్యాఫ్తు వేయించారని గుర్తు చేశారు. వైయస్ తన వ్యాపార లావాదేవీలలో అక్రమాలు లేవని నిరూపించుకోవాల్సింది పోయి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

జగన్ చర్యల ఆయన తండ్రికి అపకీర్తి వస్తుందని దానిని తుడిచి వేసేందుకు జగన్ సహకరించాలని కోరారు. కాంగ్రెసుకు ఏమాత్రం భావసారుప్యం లేని తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు ఎలా అవుతామని అన్నారు. జగనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తున్నారని విమర్శించారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వైయస్ సిబిఐ విచారణకు ఆదేశించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చూసేవారని, బాబు మాత్రం స్టే తెచ్చుకునే వారని అన్నారు. జగన్ కూడా బాబును ఫాలో అవుతున్నారన్నారు. సిబిఐ విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా బయటకు వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+