బెంగళూరు: కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి బోర్డు భూమి కుంభకోణం కేసులో మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడికి, ఇతరులకు కర్ణాటక హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. నాయుడికి, బెంగళూర్ నగర కార్పోరేటర్ అయిన ఆయన కుమారుడు జగదీష్‌కు, ఐటిఎఎస్‌సిఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ శ్రీనివాస్‌కు జస్టిస్ వి. జగన్నాథన్ బెయిల్ నిరాకరించారు.
లోకాయుక్త కోర్టు ఆ ముగ్గురికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో వారిని ఆగస్టు 8వ తేదీన జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. నాయుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
The Karnataka High Court today rejected the bail pleas of former minister Katta Subramanya Naidu and two others, facing allegations of corruption in the Karnataka Industrial Area Development Board land scam.