నన్ను, నా తల్లిని ఎదుర్కోలేకే నీచ రాజకీయాలు: జగన్

ఓదార్పు యాత్ర సభల్లో ఆయన సోమవారం ప్రసంగించారు. వైఎస్ మరణానంతరం రాష్ట్ర పరిస్థితి చూస్తోంటే గుండె తరుక్కుపోతుందని అన్నారు. రైతు సమస్యలను, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే వారు కరువయ్యారని అన్నారు. తనపై కావాలని ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓదార్చడానికి తన తండ్రి వైఎస్ఆర్ జీవించి లేకున్నా ప్రతి పేదవాడి గుండెలో వైఎస్‌ను చూస్తూ బాధను దిగమింగుతున్నానని చెప్పారు. ఎవరు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా తనకు దేవుడు, ప్రజల అండ ఉందన్నారు.












Click it and Unblock the Notifications