వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాస తీర్మానానికి రెడీ: చంద్రబాబు నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి మధ్యంతర ఎన్నికలను ఎదుర్కొనే సత్తా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్నంలో అన్నారు. విశాఖ పర్యటన అనంతరం ఆయన హైదరాబాదు వెళుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉధృతంగా ఉద్యమిస్తోందన్నారు. కాంగ్రెసు అవినీతిపై, రాష్ట్ర రైతాంగ సమస్యలు తదితర అంశాలపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెదేపా సిద్ధంగా ఉందన్నారు.

సంఘ సంస్కర్త అన్నాహజారే డిమాండ్ చేస్తున్నట్టు లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసే వ్యక్తులు కాకుండా నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులను లోక్‌పాల్ బిల్లు కమిటీలో ఉంచాలని ఆయన అన్నారు. అవినీతిపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అవినీతికి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.

English summary
Telugudesam party chief Nara Chandrababu Naidu said today that they will ready to put no confidence motion on CM Kiran Kumar Reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X