వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు సుప్రీంలోనూ షాక్, పిటిషన్ తిరస్కరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులోనూ షాక్ తగిలింది. తన ఆస్తులపై పూర్తిస్థాయి సిబిఐ దర్యాఫ్తుకు హైకోర్టు అదేశించడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు విచారించింది. జగన్ వేసిన రెండు పిటిషన్‌లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సిబిఐ విచారణ కొనసాగుతున్నందు వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకోదన్నారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నందువల్లే హైకోర్టు విచారణకు ఆదేశించిందన్నారు. వాదనలు ఏమున్నా సిబిఐకి చెప్పుకోవాలని సూచించింది. హైకోర్టు ప్రాథమిక దర్యాఫ్తు ఆధారంగా తీర్పు చెప్పలేదు. కనుక నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ కేసును జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ దల్వీర్ భండారీలతో కూడిన ద్విసభ్య బెంచ్ విచారించింది.

జగన్ తరఫున రాం జెఠ్మలానీ, ముకుల్ రోహత్గీ వాదించగా, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు తరఫున గంగూలీ అనే న్యాయవాది వాదించారు. కాగా అంతకు ముందు వారు అంతకుముందు రాం జెఠ్మలానీ సిబిఐ పూర్తి విచారణకు ఆదేశించిన హైకోర్టు తీర్పును ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంలో హైకోర్టు ఆదేశాలు ప్రాథమిక న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. సిబిఐ ప్రాథమిక నివేదిక చూడకుండానే పూర్తి విచారణకు ఆదేశించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దమన్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ సిబిఐ ప్రాథమిక నివేదికను తమకు చూపించలేదన్నారు. వీధిలో పోరాడాల్సిన రాజకీయ పార్టీలో జగన్‌పై కోర్టులో పోరాడుతున్నాయన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే తాను హైకోర్టుకు లేఖ రాసినట్లు మంత్రి శంకర్ రావే చెప్పారన్నారు.

జగన్‌పై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని మరో న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. అధిష్టానం ఆదేశాల మేరకే మంత్రి శంకర్ రావు లేఖ రాసినట్లు చెప్పారన్నారు. విచారణ పూర్తి కాకముందే అక్రమాలు ఉన్నాయని హైకోర్టు చెప్పడం సమంజసమేనా అని ప్రశ్నించారు. క్రిమినల్ మాటర్ పిల్స్ విచారించరాదన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. ఎర్రన్నాయుడు తరఫు న్యాయవాది మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ నడుచుకుంటుందని చెప్పారు. కాగా ఈ వాదనలు సుమారు రెండు గంటల పాటు సాగాయి. కాగా జగన్ తన పిటిషన్‌లో తన కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చినట్లుగా అంగీకరించారు.

English summary
Supreme Court rejected YSR Congress party president YS Jagan's petition and upheld High Court judgement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X