వైయస్సార్ సన్నిహితులతోనే జగన్‌పై ఎదురుదాడి

మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రులు రఘువీరారెడ్డి, కాసు కృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులే. జగన్ వర్గంపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెట్టాలన్న దానిపై ఈ మంత్రులు ముఖ్యమంత్రితో మీడియా సమావేశానికి ముందు సుదీర్ఘంగా భేటీ అయి చర్చించారు. ఎమ్మెల్యేల కదలికల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పటికే రాజీనామాలు చేసిన వారిలో కొందరినైనా వెనక్కి తీసుకురావటానికి ప్రయత్నించాలని నిర్ణయించారు. వైఎస్ ఇప్పుడు ఉండి ఉంటే జగన్‌పై ఆయనే సీబీఐ విచారణకు ఆదేశించి ఉండేవారని మంత్రులు అన్నారు. వైయస్ జగన్ వాదనలను వట్టి వసంతకుమార్ సుదీర్ఘంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎండగట్టే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications