జగన్ వర్గానికి ముఖం చాటేస్తున్న ఎమ్మెల్యేలు

గత మూడు రోజులుగా పలువురు ఎమ్మెల్యేలకు యువనేత వర్గానికి చెందిన ముఖ్యులు ఫోన్లు చేసి తమతో పాటు రావలసిందిగా కోరుతున్నారు. కొందరికి భారీ ప్యాకేజీల ఆశ చూపినా ఫలితం ఉండడం లేదని అంటున్నారు. కొంత మంది ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఇటీవలే కాంగ్రెస్‌తో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలపైనా జగన్ వర్గం నాయకులు వల విసురుతున్నట్లు చెబుతున్నారు.
రెండో దశలో కనీసం మరో ఆరేడుగురితోనైనా రాజీనామాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ వర్గం తాజా పరిస్థితితో డీలా పడుతోంది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా కొందరు తమ రాజీనామాలు ఆమోదించరు కదా అంటూ ఆరా తీస్తోన్నట్లు తెలిసింది. రాజీనామాలు ఆమోదించే సమయంలో ఒక్కొక్కరినే పిలిచి మాట్లాడితే కొందరు వెనక్కు తగ్గవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications