రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర విభజనతో దేశ సమగ్రతకు ముప్పు లేదు: రాజ్‌నాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajnath Singh
రాజమండ్రి: రాష్ట్ర విభజనతో దేశ సమగ్రతకు ఎలాంటి ముప్పు ఉండదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ బుధవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో అన్నారు. సమర్థ పాలన కోసం చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసినంత మాత్రాన దేశ సమైఖ్యతకు భంగం వాటిల్లదని అన్నారు. స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేస్తేనే రైతుల సమస్యలను పరిష్కరించ వచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదిక ద్వారా సుమారు 70 శాతం సమస్యలను పరిష్కరించ వచ్చునని అన్నారు. రైతులను ఆదుకునే ఏకైక మార్గం అదొక్కటే అన్నారు.

పంట విరామం ప్రకటించిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశాభివృద్ధికి వ్యవసాయ రంగం ఎంతో కీలకం అన్నారు. వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపై అన్నాహజారే పోరాటం చాలా కీలకం అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.

English summary
BJP senior leader Rajnath Singh said today that national integrity is not effected with state divide. He said mid term election may come in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X