వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌పై దండెత్తిన టిడిపి, కాంగ్రెసు నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్‌: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు దండెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో వైయస్ జగన్ సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని వారు డిమాండ్ చేశారు. కోర్టులను మభ్యపెట్టే జగన్‌ ప్రయత్నాలను సుప్రీంకోర్టు తీర్పు వమ్ము చేసిందని తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. మరణించిన వాళ్లంతా మహాత్ములన్నట్లు జగన్‌ మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో అవినీతికి మూలస్తంభం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బతికుంటే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ ప్రథమ ముద్దాయిగా ఉండేవారని ఆయన అన్నారు. అక్రమ ఆస్తుల కేసులో దోషులుగా తేలినవారి ఆస్తులను జప్తు చేయాలని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఇంత అక్రమార్జన ఎలా వచ్చిందో, ఇన్ని కంపెనీలు ఎలా వచ్చాయో జగన్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తప్పు చేయనప్పుడు జగన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. జగన్‌ అవినీతికి సంబంధించి ఏ సమాచారమైనా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. జగన్‌ అక్రమ ఆస్తులపై సీబీఐ చేపడుతున్న దర్యాప్తుల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రమేయం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించాడనే అభియోగంపై హైకోర్టు ఆదేశాలమేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. ఆరోపణలు వస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని వై.ఎస్‌ అనేవారని ఆ తండ్రికి కొడుకై ఉండి విచారణకు ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలమేరకు సీబీఐ దర్యాప్తుచేస్తుంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎవరిపై ధర్మయుద్ధం చేస్తున్నారని ప్రశ్నించారు. వారి రాజీనామాలవల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.

వైయస్ జగన్ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని కాంగ్రెసు విప్ కొండ్రు మురళి అన్నారు. రాజీనామాలు చేసిన జగన్ వర్గం శానససభ్యులు వెనక్కి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ సోనియా గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. జగన్ ఇప్పటికైనా సిబిఐకి సహకరించాలని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. సిబిఐ దర్యాప్తునకు జగన్ సహకరించాలని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు.

English summary
TDP and Congress leaders attacked YSR Congress president YS Jagan in the context of SC judgement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X