అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల హత్య కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paritala Ravi
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులోని నిందితులలో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం పదహారు మందిలో ఎనిమిది మందిని దోషులుగా కోర్టు పేర్కొంది. పరిటాల హత్య కేసులో 16 మందిని నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. అందులో నలుగురిపై కోర్టు కేసు కొట్టి వేసింది. ఆధారాలు లేనందున పటోళ్ల గోవర్దన్ రెడ్డి, జివి రెడ్డి, ఆనంద కుమార్ రెడ్డి, రామస్వామిలపై కేసు కొట్టి వేసింది. వారిపై ఎలాంటి అభియోగాలు నిరూపణ కాలేదు. మరో నిందితుడు రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే అప్రూవర్‌గా మారాడు. ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితులు అయిన మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే వారు హత్యకు గురయ్యారు. మిగిలిన ఎనిమిది మందిని దోషులుగా నిర్దారిస్తూ గురువారం మధ్యాహ్నం కోర్టు తీర్పు చెప్పింది. వారిలో వడ్డె కొండ, వడ్డె శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి, రంగనాయకులు, పెద్దిరెడ్డి, హన్మంత రెడ్డి, ఓబిరెడ్డి లకు జీవిత ఖైదు విధించింది. కాగా తీర్పు సమయంలో తమకు శిక్షను తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు.

కాగా పరిటాల రవి హత్య కేసులో 133 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఇందులో 16 మందిని నిందితులుగా పేర్కొంది. పదహారు మందిలో ముగ్గురు ఇప్పటికే హత్యకు గురయ్యారు. ఈ కేసు ఆరేళ్ల పాటు విచారణ జరిగింది. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదిన అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో హత్యకు గురయ్యారు.

English summary
Anantapur district court reveals judgement on thursday in Telugudesam Party leader Paritala Ravi murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X