చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధికి మరో షాక్, మాజీ మంత్రి నెహ్రూ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Karunanidhi
చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధికి మరో షాక్ తగిలింది. డిఎంకె మాజీ మంత్రి కెఎన్ నెహ్రూను పోలీసులు త్రిచి నగరంలో గురువారం అరెస్టు చేశారు. ఓ భూవివాదంలో ఆయన అరెస్టు జరిగింది. 13 వేల చదరపు గజాల భూమిని విక్రయించాలని నెహ్రూ ఓ వైద్యుడిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. నెహ్రూతో పాటు ఇప్పటి వరకు పోలీసులు భూకబ్జా ఆరోపణలపై ముగ్గురు డిఎంకెకు చెందిన ముగ్గురు మంత్రులను అరెస్టు చేసారు. నాలుగు వందల మందికి పైగా డిఎంకె కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.

భూకబ్జా నిరోధక ప్రత్యేక విభాగానికి 8 వేల మందికి పైగా ఇప్పటి వరకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం తాను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జయలలిత ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 462 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది మంది యజమానులకు వారి భూములను అప్పగించారు కూడా. దాదాపు 415 కోట్ల రూపాయల విలువ చేసే భాములను సొంతదారులకు అప్పగించనున్నట్లు జయలలిత బుధవారం శాసనసభలో చెప్పారు.

English summary
Another former powerful DMK minister, KN Nehru was on Thursday arrested by the police for his alleged role in usurping the land belonging to a doctor in Trichy city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X