మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేత.. ప్రభుత్వం సంచలన ఆదేశాలు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా పేద, మధ్య తరగతి, అభివృద్ది చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే అప్పులతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలకు కనీస అవసరాలను సమకూర్చడంలో అక్కడి ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దేశ ప్రజలకు పూట గడవడమే ఇబ్బందిగా మారింది.

అలాగే పాకిస్థాన్ లో ఇంధన, విద్యుత్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు, దేశంలో తీవ్రతరం అవుతున్న విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రధాన రాష్ట్రాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, స్టోర్లను ఇకపై రాత్రి 8 గంటలకే మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

మరోవైపు రెస్టారెంట్లు, బేకరీలు, టాండూర్లు, పెళ్లి వేడుకలు జరిగే హాల్స్ రాత్రి 10 గంటల కల్లా క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లు కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతులు ఇస్తున్నారు. అలాగే అత్యవసరమైన మెడికల్ షాప్స్, ఫార్మసీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఇప్పటికే విద్యుత్, ఇంధన సంక్షోభం నుంచి బయట పడటానికి పాకిస్థాన్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. అందులో వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలు పెట్టడం, ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాను తగ్గించడం, ప్రభుత్వ శాఖల ఖర్చుల్లో 20 శాతం మేర కోత విధించడం తదితర చర్యలు ఉన్నాయి.

Pakistan Government Orders Markets and Shopping Malls to Close by 8 PM Sensational New Directive

మరోవైపు పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పాకిస్థాన్ లో వినియోగదారుల సూచీ మే నెలలో ఏకంగా 11.7 శాతానికి పెరిగింది. గత రెండేళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఇక ఇప్పటికే పాకిస్థాన్ లో పెట్రోల్, డిజిల్ రేట్లను గణనీయంగా పెంచేశారు. ఇంధనమే కాకుండా రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని తాకుతున్నాయి. టమాటోలు 75 శాతం, ఉల్లిపాయలు 42 శాతం, గోధుమలు దాదాపు 40 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా గతేడాదితో పోల్చితే ఏకంగా 33 శాతం పెరిగినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+