హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు దూకుడు తెచ్చిన తంటా, సీనియర్ల అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే దీక్ష చేపట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సిబిఐ దర్యాప్తు వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, కేంద్ర ప్రభుత్వంపై అన్నా హజారే అస్త్రం ఎక్కుపెట్టడం వల్ల కాంగ్రెసు నాయకులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్థితి లేదు. దీంతో చంద్రబాబు ఉత్సాహం ముంచుకొచ్చింది. అంతే, ఎదురుదాడికి దిగుతూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

దివంగత నేత వైయస్సార్, ఆయన కుమారుడు వైయస్ జగన్‌లపై, కాంగ్రెసుపై ఆయన అవినీతి ఆరోపణలను దంచికొడుతున్నారు. పనిలో పనిగా తనపై ఆరోపణలు చేస్తూ వార్తాకథనాలు ప్రచురిస్తున్న సాక్షి దినపత్రికపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఈ ఉత్సాహంలో ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనలు పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. వేయి కోట్లిస్తే తన ఆస్తులు రాసిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన ప్రత్యర్థులకు ఆయుధాన్ని అందించినట్లయింది.

వేయి కోట్ల రూపాయల ఆస్తులను చంద్రబాబు కూడగట్టుకున్నట్లు ఆ ప్రకటన అర్థం ఇస్తోంది. దీంతో రెండెకరాల ఆసామి వేయి కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారనే విమర్శలు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి ఎదురవుతున్నాయి. చంద్రబాబు అత్యుత్సాహం వల్ల ఈ సమస్య తలెత్తిందని పార్టీ సీనియర్లు అంటున్నారు. దూకుడు మంచిదే గానీ కాస్తా ఆలోచించి ప్రకటనలు గుప్పించాలనేది వారి అభిప్రాయం.

English summary
It is learnt that TDP president N Chandrababu Naidu's statements are counter productive during anti corruption campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X