జగన్‌ను మళ్లీ వెనకేసుకొచ్చిన సుష్మా స్వరాజ్

లోక్‌పాల్ బిల్లుపై లోక్‌సభ చేపట్టిన చర్చను యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోందని సుష్మాస్వరాజ్ అన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగడంతో చారిత్రాత్మక దినమైందని ఆమె అన్నారు. చర్చ శాంతియుత వాతావరణంలో జరగాలని ఆమె పిలుపునిచ్చారు. గత 43 ఏళ్లుగా లోక్‌పాల్ వచ్చినట్టే వచ్చి వెనక్కిపోతోందని ఆమె అన్నారు. గతంలో తొమ్మిదిసార్లు ఈ బిల్లు పెట్టేందుకు ప్రయత్నించారని సుష్మా వెల్లడించారు. గతంలో తమ ఎన్డీయే సర్కారు సైతం బిల్లును ప్రవేశపెట్టడంతో విఫలమైందని అన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై పోరులో హజారే పోరాటం చిరస్మరణీయమని ఆమె ప్రశంసించారు.
ప్రభుత్వ ప్రతిపాదిత లోక్‌పాల్ బిల్లుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అన్నా ఆరోగ్యం దృష్ట్యా దీక్షను విరమించుకోవాలని ఆమె కోరారు. అదే సమయంలో సమర్థవంతమైన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించాలని సుష్మా డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బయటపడిన అవినీతి కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయని సుష్మ విమర్శించారు. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని సుష్మ అన్నారు. ప్రణబ్ ప్రకటన కొంత అసంపూర్తిగా ఉందని విమర్శించారు.












Click it and Unblock the Notifications