జగన్ అవినీతిపై విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు

దేశంలోని అవినీతిపరుల జాబితాలో ఆయన వైయస్ జగన్ పేరును చేర్చారు. రాజా, కనిమొళి, గాలి సోదరులు, కల్మాడీ, జగన్ అంటూ ఆయన దేశంలోని అవినీతిపరుల జాబితాను వినిపించారు. నాదర్‌గుల్ గ్రామాన్నే ఓ వ్యక్తి బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుని జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని ఆయన గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టుబడిదారులు పనులు చేయించుకోవడానికి ప్రతిగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, దానివల్ల ఏర్పడిన పరిస్థితి వల్ల ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వెనకాడుతున్నారని ఆయన అన్నారు.
యువత అవినీతి అంతానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుకున్న యువత స్వార్థంతో ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారని, అవినీతిపై పోరాటం చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అవినీతిరహిత సమాజం కోసం పోరాడుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications