కెసిఆర్ తొత్తు: కోదండరామ్‌పై ఎర్రబెల్లి కామెంట్

కలిసి నిర్ణయం తీసుకుని మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధపడితే తెలంగాణ ద్రోహులెవరో తేలిపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామాలకు కలిసి రావాలని ఆయన కోరారు. వచ్చే నెల 5వ తేదీలోగా రాజీనామాలకు సిద్ధపడాలని ఆయన కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఓ బహిరంగ లేఖ రాసింది. రాజీనామాలకు కలిసి రావాలని తెలంగాణ మంత్రి జానారెడ్డికి లేఖ రాయనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.
తెలంగాణ శాసనసభ్యులకు చెప్పుల దండలు వేయాలని ఆదేశించడానికి కోదండరామ్ ఎవరని ఆయన అడిగారు. చట్టసభలను అవమానించే విధంగా కోదండరామ్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు తెరాసకు చెప్పుల దండలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications