"నీళ్ల నివాసాన్ని మనం ఆక్రమిస్తే.. అవి మన నివాసాలను ఆక్రమిస్తాయి"

మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ నది ప్రక్షాళన తొలి దశ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ మాదాపుర్‌ లోని పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులను సీఎంకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ వివరించారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మన హైదరాబాద్‌ చుట్టూ ఎన్నో కొండలు, చెరువులు ఉండేవని.. ఓఆర్‌ ఆర్‌ లోపల 1372 చెరువుల్లో 50 శాతం కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నగరంలో చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు, ట్రాఫిక్ జామ్‏ తో వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. నీళ్ల నివాసాన్ని మనం ఆక్రమిస్తే ఆ నీళ్లు మన జీవితాలను ఆక్రమిస్తున్నాయన్నారు. అలాగే మూసీ నది కాలుష్యం నల్లగొండ జిల్లా ప్రజల పాలిట విషంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కాలుష్య రహిత మంచి నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తన ఆలోచని అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

RevanthReddy inaugurated the Thammidikunta Lake if we encroach water water will encroach our lives

అలాగే తమ్మిడికుంట చెరువు అభివృద్ధి కోసం అక్కినేని నాగార్జున రెండెకరాలు ఉదారంగా ఇచ్చారని.. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ నాగార్జున హీరోనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన నిజమైన హైదరాబాదీ అని కొనియాడారు. మరోవైపు తమ్మిడికుంటను 'లేక్ ఎకానమీ' గా మార్చి.. స్వయం శక్తి సంఘాలకు స్టాల్స్ కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేశారు. అంతేకాక ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాలు కల్పించి.. ఆ ప్రాంతంలో ఓ జమ్మి చెట్టు నాటాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+