మరో భారీ ఉగ్రదాడి.. డీఎస్పీ సహా 11 మంది పోలీసులు మృతి.. 12 మందికి సీరియస్

పాకిస్థాన్‌ లోని ఖైబర్‌ పఖ్తున్‌ ఖ్వా ప్రావిన్స్‌ లో పోలీసులే లక్ష్యంగా భీకర కాల్పులు జరిగాయి. అక్రమ బంగారం మైనింగ్ ను అడ్డుకునేందుకు పోలీసులు వ్యాన్ లో వస్తున్న క్రమంలో టెర్రరిస్టులు పొదల చాటున నక్కి ఒక్కసారిగా వారి వ్యాన్ పై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది పోలీసులు మృతి చెందారు. మృతుల్లో డీఎస్పీ కూడా ఉన్నారు. మరో 12 మంది పోలీసులు గాయపడినట్లు ఓ అధికారి తెలిపారు. ఖైబర్‌ పఖ్తున్‌ ఖ్వా ప్రావిన్స్‌ లోని కోహత్ జిల్లాలోని గుంబాత్ కోహత్ ప్రాంతంలో అక్రమంగా బంగారం మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు బయల్దేరారు.

అయితే మార్గమధ్యలో దర్బోకచ్ జలంధర్ బందా ప్రాంతంలోని పొదల చాటున మాటు వేసిన ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీస్ అధికార ప్రతినిధి మహమ్మద్ నౌమాన్ జెబ్ స్పష్టం చేశారు. పోలీసులే లక్ష్యంగా మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ మెరుపు దాడిలో 11 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడినట్లు వివరించారు. క్షతగాత్రులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని స్పష్టం చేశారు. ఇక మృతుల్లో డీఎస్పీ గంబత్ హైదర్ జమాన్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ముక్తియార్ ఉన్నట్లు మహమ్మద్ నౌమాన్ జెబ్ వెల్లడించారు. ఈ దాడుల్లో ఐదు మొబైల్ ఫోన్స్ పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు.

Terrorists open heavy fire Khyber Pakhtunkhwa province 11 police personnel including a DSP killed

ఉగ్రమూకలు పోలీస్ వ్యాన్ పై భీకర కాల్పులు చేపట్టారని దాంతో అటు పోలీసులు- మిలిటెంట్ల మధ్య పరస్పర కాల్పులు చాలా సేపు కొనసాగాయని అన్నారు. ఈ క్రమంలో సంఘటనాస్థలికి మరికొంతమంది పోలీస్ సిబ్బందిని తరలించినట్లు పోలీస్ అధికార ప్రతినిధి మహమ్మద్ నౌమాన్ జెబ్ తెలిపారు. కాల్పుల ఘటన నేపథ్యంలో కోహత్ జిల్లాలో ఎమర్జెన్సీ విధించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనను ఖైబర్‌ పఖ్తున్‌ ఖ్వా ప్రావిన్స్‌ గవర్నర్ ఫైజర్ కరీమ్ కుందీ తీవ్రంగా ఖండించారు. క్రిమినల్స్, టెర్రరిస్టుల మధ్య ఉన్న సంధి కారణంగానే ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు నివాళులు అర్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+