గ్రీస్‌లో వేడుకగా అనిరుధ్-కావ్య మారన్ వివాహం.. ఫోటోలు వైరల్!

దక్షిణాది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సన్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో బుధవారం(నవంబర్ 11) అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వీరి వివాహం కన్నులపండవగా జరిగింది. వివాహానికి సంబంధించిన మొదటి ఫోటోను అనిరుధ్ రవిచందర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Kavya Maran Anirudh wedding:గ్రీసులో పెళ్లి -ఎవరెవరు హాజరు అవుతున్నారు..?
Kavya Maran Anirudh wedding:గ్రీసులో పెళ్లి -ఎవరెవరు హాజరు అవుతున్నారు..?

హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు
గ్రీస్‌‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనిరుధ్ మేనమామ, సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పెళ్లి సందర్భంగా అనిరుధ్, కావ్య ఐవరీ రంగు సాంప్రదాయ దుస్తుల్లో ప్లాటినం, ముత్యాల ఆభరణాలతో ఎంతో అందంగా మెరిసిపోయారు. "నా జీవితంలో ఒక్కసారి లభించే అద్భుత బంధం.. జీవితాంతం నిలిచిపోయేది" అంటూ అనిరుధ్ పోస్ట్ చేయగా.. సన్ పిక్చర్స్ కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా వీరి పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలను షేర్ చేసింది.

Anirudh Ravichander and Kavya Maran Married in Greece See Wedding Photos guest list Here

సుదీర్ఘ ప్రేమ ప్రయాణం
గత కొన్నేళ్లుగా వీరిద్దరి ప్రేమాయణంపై సోషల్ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ.. ఇద్దరూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇటీవల కుటుంబ వేడుకల్లో కలిసి కనిపించిన ఈ జంట చివరికి డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు.

స్టార్ బాయ్ సడన్‌గా ఇలా మారిపోయాడేంటి? పోస్టర్ చూస్తే ఎన్నో ప్రశ్నలు!
స్టార్ బాయ్ సడన్‌గా ఇలా మారిపోయాడేంటి? పోస్టర్ చూస్తే ఎన్నో ప్రశ్నలు!

నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్
గ్రీస్‌‌లో కుటుంబ సభ్యుల మధ్య వివాహం ముగిసిన అనంతరం ఈ నెల 21న చెన్నైలో అత్యంత వైభవంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు భారతీయ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రికెట్ దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+