చిన్న రాంగ్ రూట్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి.. వీడియో వైరల్

రోడ్డు ప్రమాదాలు చెప్పి రావు.. రోడ్డుపై మనం ఒక్కోసారి చేసే చిన్న చిన్న తప్పులే ప్రాణాలను తీసేంతగా మారతాయి. చాలామంది రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వేగంగా గమ్యస్థానాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తుంటారు. చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. రాంగ్ రూట్ లో రావడం తప్పుగా భావించరు. కానీ ఆ రాంగ్ రూట్ కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని నల్లకుంట పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాంగ్ రూట్ ప్రయాణం ఇతరుల జీవితాలకు ఎలా ముప్పుగా మారుతుందో ఈ ఘటనే నిదర్శనమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

బాధ్యతగల హోదాలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి రాంగ్ రూట్.. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని జీవిత ప్రయాణాన్ని నడిరోడ్డుపై శాశ్వతంగా ముగించేసిందని సీపీ సజ్జనార్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ చదువుతూ.. రేపటి రోజున ఇంజినీర్‌ గా దేశానికి సేవలందించాలని ఎన్నో కలలు కన్న ఆయేషా ముస్ఫిరా ఆశలన్నీ, ఎదురుగా రాంగ్ రూట్‌ లో వచ్చిన నిర్లక్ష్యపు బైక్ వల్ల క్షణాల వ్యవధిలోనే రాలిపోయాయని ఎమోషనల్ అయ్యారు.

Nallakunta Hyderabad Bank employee s reckless driving in the wrong lane in leads to student s death

నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో ఇటీవల జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కుమార్తెను కాలేజీకి తీసుకెళ్తున్న ఆ తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే కళ్లముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన కూతురు విగతజీవిగా రోడ్డుపై పడివుండటం చూసి, నిస్సహాయంగా ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిందని గుర్తు చేశారు.

కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు ఎవరింటి దీపాన్నో ఆర్పేస్తోంది. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరంగా సజ్జనార్ పేర్కొన్నారు. గుర్తుంచుకోండి.. మీరు తీసుకునే రాంగ్ రూట్.. మరొకరి జీవితానికి రాంగ్ ఎండ్ కాకూడదు! ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించండి.. అమాయకుల ప్రాణాలను బలితీసుకోకండని కీలక సందేశాన్ని ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+