వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పకు షాక్, ముందస్తు బెయిల్ తిరస్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న యడ్యూరప్ప దరఖాస్తును హైకోర్టు సోమవారం తిరస్తరించింది. దీంతో ఆయన భూముల నోటిఫికేషన్ కేసులో ఆయన లోకాయుక్త ప్రత్యేక కోర్టు ముందు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు వేర్వేరు కేసుల్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ల్లో ఆయన పేరుంది.

నిజానికి శనివారంనాడే యడ్యూరప్ప లోకాయుక్త ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆరోగ్యం బాగా లేదనే సాకు చెప్పి ఆయన డుమ్మా కొట్టారు. ఆయన డయాబెటిస్, హైపర్ టెన్షన్, జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన శనివారం సాగర్ ఆస్పత్రిలో చేరారు. యడ్యూరప్ప ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో యడ్యూరప్ప అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది.

English summary
Former Karnataka Chief Minister BS Yeddyurappa's anticipatory bail has been rejected on Monday. The bail was rejected by the Karnataka High Court on the alleged land scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X