చిరంజీవిపై మెగా బాధ్యత, ఉప ఎన్నికల్లో ప్రచారం

ఆ ఎన్నికలు వేరు, అవి జరిగిన సందర్భం వేరని, వచ్చే ఉప ఎన్నికలకు ఆ ఎన్నికలతో పోలిక లేదని అంటున్నారు. కడప, పులివెందులల్లో వైయస్సార్ కుటుంబాన్ని దెబ్బ తీయడం అంత సులభం కాదని, పైగా అప్పుడు సెంటిమెంటు గణనీయంగా ఉందని అంటున్నారు. అందువల్ల అక్కడ చిరంజీవి ప్రచారం చేసినా ఫలితం దక్కకపోవడం ఆశ్చర్యమేమీ కాదని అంటున్నారు.
వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికే చిరంజీవిని కాంగ్రెసు అధిష్టాన వల వేసి పట్టిందని, వచ్చే ఉప ఎన్నికల్లో అధిష్టానం ఆశలు నిజం చేయగలననే విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత చిరంజీవిపై ఉంటుందని అంటున్నారు. తన ప్రచారం ద్వారా ఉప ఎన్నికల్లో ఫలితాలు సాధించగలిగితే కాంగ్రెసు చిరంజీవి స్థానం కూడా సుస్థిరమవుతుందని, వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెసులో తిరుగులేని నాయకుడిగా ముందుకు రావడానికి అది ఉపయోగపడుతుందని అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఉప ఎన్నికల ప్రచార బరిలోకి దిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications