వైయస్ పుస్తకావిష్కరణ సభ: కెవిపికి విహెచ్ షాక్

V Hanumanth Rao
న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై రాసిన పుస్తకావిష్కరణ సభకు కొద్ది గంటల వ్యవధి ఉన్న సమయంలో కాంగ్రెసు రాజ్యసభ వి. హనుమంతరావు మరో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుకు షాక్ ఇచ్చారు. వైయస్సార్, మ్యాన్ ఆఫ్ ద పీపుల్ అనే పుస్తకావిష్కరణ సభను కెవిపి రామచందర్ రావు మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తలపెట్టారు. ఆ పుస్తకావిష్కరణ సభకు వెళ్లవద్దంటూ విహెచ్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు, కాంగ్రెసు నాయకులకు ఓ లేఖ రాశారు. వైయస్ జగన్‌కు లబ్ధి చేకూర్చే విధంగా కెవిపి రామచందర్ రావు పుస్తకావిష్కరణ సభను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.

పుస్తకావిష్కరణ సభకు వెళ్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బలపరిచినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ తల్లి కూడా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తిట్టారని ఆయన గుర్తు చేశారు. ఆ సభకు వెళ్తే కాంగ్రెసుకు సంబంధించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. జగన్ సాక్షి దినపత్రికలో కాంగ్రెసును దుయ్యబడుతూ వార్తలు రాస్తున్న నేపథ్యంలో వైయస్ పుస్తకావిష్కరణ సభకు వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను సమర్థిస్తూ బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ బిజెపితో జగన్ స్నేహం చేస్తున్న నేపథ్యంలో వైయస్ పుస్తకావిష్కరణ సభకు వెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు.

వైయస్సార్ పుస్తకావిష్కరణ సభకు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వంటి వారంతా వెళ్లాల్సి ఉంది. విహెచ్ లేఖ నేపథ్యంలో సభకు వెళ్లాలా, వద్దా అనే విషయంపై కొంత మంది మీమాంసలో పడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+