చంద్రబాబు కుటుంబం ఆస్తులు రూ.39 కోట్లే

తన పేర ఓ ఇల్లు ఉందని అది కట్టినప్పుడు 23 లక్షలు అయిందని చెప్పారు. తన భార్య భువనేశ్వరి పేరిట పంజాగుట్టలో 650 గజాల భవనం ఉందన్నారు. 2004-2009ల మధ్య ఆస్తులు అసెంబ్లీకి సమర్పించినట్లు చెప్పారు. హెరిటేజ్ పేర 98 కోట్ల అప్పు ఉందన్నారు. తనకు శేరిలింగంపల్లిలోని మదీనగూడలో 5ఎకరాల సాగు భూమి, సజ్జాపూర్‌లో 3 ఎకరాల భూమి ఉందన్నారు. లిస్టెండ్ కంపెనీల్లో రూ.19 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయన్నారు. తన కోసం ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి గానీ, ఒక్క ఎకరా గానీ భూమిని తీసుకోలేదన్నారు. పారదర్శకత కోసమే తన ఆస్తుల వివరాలు ప్రకటించానన్నారు. రాజకీయ నాయకులంతా తమ తమ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకులు విశ్వసనీయత కోల్పోతున్నాయన్నారు. పార్టీలు విశ్వసనీయత నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం ఇతరుల ఆస్తులను తన ఆస్తులుగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను ప్రకటించిన ఆస్తులకు ఎక్కువగా ఎక్కడైనా ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. అవసరమైన పక్షంలో ప్రతి సంవత్సరం కూడా తన ఆస్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. దేశంలో అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications