చంద్రబాబు ఆస్తులపై విరుచుకుపడిన లక్ష్మీపార్వతి

లక్షా 45 కోట్ల ఆదాయం ఉన్న చంద్రబాబు ఇన్ని కోట్ల ఆస్తిపరుడు ఎలా అయ్యాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి చంద్రబాబు డబ్బులు తీసుకునేవారని ఆమె అన్నారు. నకిలీ నోట్ల కేసులో పట్టుబడిన రామకృష్ణా గౌడ్‌తో చంద్రబాబుకు సంబంధం ఉందని, కృషి బ్యాంక్ చైర్మన్ వెంకటేశ్వర రావును వారం రోజుల పాటు దాచి పెట్టి విదేశాలకు పంపించివేశాడని ఆమె ఆరోపించారు. ఎన్టీ రామారావు చంద్రబాబుకు ఇస్తానన్న ఐదు లక్షల రూపాయల కట్నం కూడా ఇవ్వలేదని, దానికి ఎన్టీ రామారావును చంద్రబాబు ఎల్లవేళలా తిడుతూ ఉండేవాడని, పిసినారి అని నిందిస్తూ ఉండేవాడని, ఎన్టీఆర్ ఏం ఇచ్చారని ఆస్తులు పెరిగాయని ఆమె అన్నారు.
మేనేజ్ చేసుకోగలడు కాబట్టి చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాడని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాదు పంజగుట్టలో ఉన్న హెరిటేజ్ కార్యాలయం భూమి ఎవరిదని ఆమె అడిగారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏం చేస్తున్నాడని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆమె అడిగారు. చంద్రబాబు నటనలో పండిపోయారని, చంద్రబాబుకు ఒకేసారి 20 అవార్డులు నటనకు గాను ఇవ్వవచ్చునని లక్ష్మిపార్వతి అన్నారు.












Click it and Unblock the Notifications