వైయస్ బావమరిది హరిత ఫెర్జిలైజర్స్‌పై దాడులు

వ్యవసాయ అధికారులు రాష్ట్రంలోని పలుచోట్ల ఎరువుల మిక్సింగ్ కంపెనీలపై దాడులు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 1500 మెట్రిక్ టన్నుల యూరియాను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 5400 మెట్రిక్ టన్నుల యూరియా, పొటాషియం స్వాధీనం చేసుకున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న ఎరువులను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారిణి ఉషారాణి చెప్పారు. కాగా అక్రమంగా ఎరువులు దొరికిన మిక్సింగ్ ప్లాంట్లను సీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications