పద్మనాభుని ఆరో గది అంశం కోర్టు నిర్ణయిస్తుంది: సుప్రీం

ఆరో గదిని తెరవకూడదన్న రాజవంశీయుల విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించలేదు. జ్యోతిష్యాన్ని నమ్మడం తగదని వారికి సూచించింది. అయితే కేసును ఈ నెల 12వ తేదికి వాయిదా వేసింది. సంపద లెక్కింపు కోసం వేసిన కమిటీ మొత్తం విచారణను చిత్రీకరించవచ్చునని చెప్పింది. ఆలయ భద్రత, ఖర్చుల వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కాగా గతంలో ఆరోగదిని తెరిచే అంశంపై రాజవంశీయులు దైవ ప్రశ్నం జరిపారు. ఈ దైవప్రశ్నంలో ఆలయంలోని ఆరోనేలమాళిగను తెరవ కూడదని సూచించిన విషయం తెలిసిందే. ఆరోగదికి నాగబంధం ఉందని అది తెరిస్తే అరిష్టం అని చెప్పారు. కానీ దానిని కోర్టు తిరస్కరించింది.












Click it and Unblock the Notifications