వైయస్ ఇమేజ్, కుట్ర కోణాన్ని వదిలి పెట్టని జగన్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై కుట్ర కోణాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వదిలిపెట్టేట్లు లేరు. వైయస్ రెండో వర్ధంతి సందర్భంగా వైయస్ వ్యక్తిత్వ హత్యకు మహా కుట్ర అంటూ వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక పతాక శీర్షిక కింద ఓ భారీ వార్తాకథనాన్ని ప్రచురించగా, సాక్షి టీవీ చానెల్ వైయస్ మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఓ వార్తాకథనాన్ని శుక్రవారం ఉదయం ప్రసారం చేసింది. కపట ప్రేమ ఒలకబోస్తూనే కాంగ్రెసు పార్టీ వైయస్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే కుట్ర చేస్తోందని సాక్షి దినపత్రిక ఆరోపించింది. చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియాల సాయంతో ఈ దిశగా పకడ్బందీ కుట్ర చేసిందని వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీ ఎల్లో పార్టీగా, ఈనాడు.. ఆంధ్రజ్యోతి దినపత్రికలను ఎల్లో మీడియాగా సాక్షి అభివర్ణించిందనేది స్పష్టమే.

పదవిలోనూ, అధికారంలోనూ లేని జగన్‌ను నేరుగా ఏమీ అనలేరు గనుక... వైఎస్‌ను అడ్డం పెట్టుకుని ఆయనపై బురదజల్లేందుకు తెగిస్తున్నారని, అలాగని వైఎస్‌ను నేరుగా విమర్శించినా జనం ఊరుకోరు గనుక, కోర్టును అడ్డం పెట్టుకుని అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్నంతా ప్రజలు గమనించే సరికి... ఒకవైపు వైఎస్‌ను తమవాడేనంటూ సొంతం చేసుకుంటూ, మరోవైపు జగన్‌ను మాత్రం ఇబ్బంది పెట్టేలా డబుల్ గేమ్ మొదలు పెట్టారని సాక్షి తన వార్తాకథనంలో విరుచుకుపడింది.

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చడం ఒక ఎత్తయితే, దానిపై ప్రభుత్వ పెద్దలే ఆడుతున్న వింత నాటకాలు మరో ఎత్తు అని, ఆ సంగతే తమకు తెలియదంటూ తొలుత బుకాయించారని, తర్వాతేమో, ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా వైఎస్ పేరు లేదని స్వయంగా సీఎం కిరణే, అది కూడా ఢిల్లీ గడ్డపైనే ప్రకటించారని అన్నది. దర్యాప్తు జరిగేది జగన్ కంపెనీలపై మాత్రమేనంటూ పచ్చి అబద్ధాలు చెప్పారని వ్యాఖ్యానించింది. 'రాజశేఖరరెడ్డితో కలిసి జగన్ కుట్ర, మోసం, అవకతవకలు, నమ్మకద్రోహం వంటి నేరాలకు పాల్పడ్డారు" అని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా ఉన్నా ప్రభుత్వాధినేతకు మాత్రం అది కన్పించడం లేదని, మరికొందరు మంత్రులైతే, సీఎంగా వైఎస్ తీసుకున్న నిర్ణయాలతో తమకు సంబంధం లేదు పొమ్మన్నారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+