అమెరికా దౌత్య రహస్యాల గుట్టురట్టు చేసిన వికీలీక్స్

అమెరికా దౌత్య కేబుల్స్‌ను యథాతథంగా విడుదల చేయడంపై వికీలీక్స్ మీడియా భాగస్వాములైన నాలుగు పత్రికలు తీవ్రంగా స్పందించాయి. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆ వెబ్‌సైట్ అధినేత జూలియస్ అసాంజే ఒక్కరే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారంటూ ద గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, జర్మన్ పత్రిక డెర్ స్పీగల్, స్పానిష్ డైలీ ఎల్ పైస్ మండిపడ్డాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఆ సైట్‌కు దూరమవుతున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. కాగా గతవారం 1.34 లక్షల కేబుల్స్‌ను ఎలాంటి మార్పులు చేయకుండా పేర్లు, వివరాలతో సహా విడుదల చేయడంపై అమెరికా మండిపడింది. అయితే గార్డియన్ పత్రిక జర్నలిస్టుల్లో ఒకరు పాస్‌వర్డ్ లేకుండా కేబుల్స్‌ను లీక్ చేశారంటూ వికీలీక్స్ ఆరోపణలు గుప్పించడంతో, ఆ పత్రిక తీవ్రంగా ఖండించింది.












Click it and Unblock the Notifications